తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లైఫ్ మీ చేతుల్లో ఉండాలంటే ఇలా చేయండి: పూరి జగన్నాథ్​ - దర్శకుడు పూరిజగన్నాథ్ పూరి మ్యూజింగ్స్

Purijagannadh puri missings: దర్శకుడు పూరిజగన్నాథ్​.. 'పూరి మ్యూజింగ్స్​' ద్వారా మరో కొత్త విషయాన్ని వివరించారు. 'లైఫ్​ ఇన్​ కంట్రోల్'​ అనే అంశంపై మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

puri
పూరీ

By

Published : Jan 17, 2022, 10:04 PM IST

Purijagannadh puri missings: క్రమశిక్షణగా జీవితాన్ని గడిపేవాళ్ల జీవితం 80శాతం వారి చేతుల్లోనే ఉంటుందని, మిగిలిన 20శాతం దేవుడి దయ అని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ‘పూరి మ్యూజింగ్స్‌’ ద్వారా యూట్యూబ్‌ వేదికగా పంచుకుంటారాన. తాజాగా ‘లైఫ్ ఇన్‌ కంట్రోల్‌’ అనే అంశంపై మాట్లాడారు.

"లైఫ్‌ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. మనం చెప్పినట్టు వినదు. పట్టుకుందామంటే జారిపోతుంది. ఈ అనిశ్చితి వల్ల బీపీ వస్తుంది. కానీ, కొన్ని కొన్ని పనులు చేస్తే, మన జీవితం కొంత కంట్రోల్‌లో ఉంటుంది. కొంచెం పట్టు సంపాదించవచ్చు. పని ఉన్నా లేకపోయినా, రోజూ ఒక గంట వ్యాయామం చేస్తే, 30శాతం జీవితం మన కంట్రోల్‌లో ఉంటుంది. దాని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు రావు. ఆస్పత్రిలో గడపాల్సిన అవసరం ఉండదు. మంచి డైట్‌ తీసుకుంటూ, నీళ్లు ఎక్కువ తాగుతూ ఆల్కహాలు తగ్గిస్తే, మన జీవితం ఇంకొంచెం కంట్రోల్‌లో ఉన్నట్టే. ఆ తర్వాత మన మైండ్‌. ఏది తప్పు.. ఏది ఒప్పు.. అనేది మీకు తెలిస్తే, జీవితంలో సగం దరిద్రాలు తగ్గుతాయి. పిచ్చి నమ్మకాలు, భయాలు, అత్యాసలు, మూఢనమ్మకాలు లేకపోతే మీ జీవితం ఇంకా బాగుంటుంది. ఖాళీగా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంటే, జీవితంపై ఇంకొంచెం పట్టు దొరుకుతుంది. సోషల్‌మీడియాకు దూరంగా ఉంటే మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు. మీ టాలెంట్‌, మీ క్యారెక్టర్‌, మీ నిజాయతీ మిమ్మల్ని చాలా వరకూ కష్టాలకు దూరంగా ఉంచుతాయి. ఈ కాస్త పనులు చేస్తే, 80శాతం జీవితం మీ చేతుల్లో ఉంటుంది. మిగిలిన 20శాతం మనం చెప్పలేం. అవతలి వాళ్లు ఎలా స్పందించారు? రోడ్డు మీద కారు వచ్చి ఢీకొట్టిందా? సునామీ వచ్చిందా? వైరస్‌ వచ్చిందా? యుద్ధం వచ్చిందా? టోర్నడో వచ్చి నిన్ను నేలకేసి కొట్టిందా? ఇలాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. పైన చెప్పినవన్నీ పాటిస్తూ ఏ అడవిలోనో సాధువులా జీవిస్తే, అసలు మీ జాతకం ఏ జ్యోతిష్యుడికి చూపించాల్సిన అవసరం లేదు. ఏ గుడిలోనూ మీ గురించి పూజ చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి మీరు అసలు బరువే కారు. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లంతా చాలా క్రమశిక్షణతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. మనకున్న కష్టాలు వాళ్లకు ఉండవు. మనకంటే హ్యాపీగా ఉంటారు. హాయిగా ఉంటారు. నేను చెప్పేది క్రమశిక్షణ కలిగిన వాళ్లకు 80శాతం జీవితం వాళ్ల చేతిలోనే ఉంటుంది. మిగిలిన 20శాతం దేవుడి దయ. మీరెంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయినా, పొరపాటున పెళ్లి చేసుకుంటే 80శాతం జీవితం మీ చేతుల్లో ఉండదు. మిగిలిన 20శాతం జీవితం కూడా మీ ఆవిడ/భర్త చేతిలోనో ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి:ఆ పాటను అంతా తప్పుగా అర్థం చేసుకున్నారు: పూరి జగన్నాథ్‌

ABOUT THE AUTHOR

...view details