తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'డబుల్​ ఇస్మార్ట్​ టైటిల్​ రిజిస్టర్​ చేయించేశాం' - Puri Reveals Title Of iSmart Shankar Sequel

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్.' ఈ సినిమా విజయం సాధించినందని రామ్​గోపాల్ వర్మ పూరీకి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు.

సినిమా

By

Published : Jul 19, 2019, 2:28 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని - పూరీ జగన్నాథ్‌ల కలయికలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'ఇస్మార్ట్‌ శంకర్‌.' గురువారం విడుదలైన ఈ సినిమా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా సినీప్రియులకు సరికొత్త వినోదాన్ని పంచుతోంది. కలెక్షన్ల పరంగానూ తొలిరోజు బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించింది.

ఈ సినిమాకు వస్తున్న స్పందనపై తన శిష్యుడు పూరీకి ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపాడు రామ్​గోపాల్​వర్మ. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అందరి దృష్టినీ ఆకర్షించింది. "హే.. పూరి జగన్నాథ్‌ &రామ్‌ దయచేసి మీరు క్షణం ఆలస్యం చేయకుండా 'ఇస్మార్ట్‌ శంకర్‌ 2'ను షురూ చేయండి. ఈసారి డబుల్‌ దిమాక్‌కు బదులుగా ట్రిపుల్‌ దిమాక్‌ అయి ఉండాలి" అంటూ ప్రేమను కురిపించాడు వర్మ.

పూరీ స్పందిస్తూ.. "సర్‌.. ఇప్పటికే 'డబుల్‌ ఇస్మార్ట్‌' టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించేశాం" అని సీక్వెల్‌ స్టోరీని బయటపెట్టేశాడు. తిరిగి స్పందించిన వర్మ.. "వా...వ్‌! ఇంకా బెటర్‌" అని సంతోషం వ్యక్తం చేశాడు. అనంతరం ఛార్మిని కూడా తమ ముచ్చట్లలోకి లాగిన వర్మ.. "హే ఛార్మి.. రేపు నేను మీ ఇస్మార్ట్‌ శంకర్‌ టీమ్‌తో పార్టీ చేసుకునేందుకు వస్తున్నాను" అని పార్టీకి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచనలిచ్చేశాడు.

ఆర్జీవీ-పూరీ ట్విట్టర్ సంభాషణ

వీరి ముచ్చట్ల పుణ్యమాని సీక్వెల్‌ కూడా త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. మరి ఇందులోనూ ఎనర్జిటిక్‌ స్టారే కథానాయకుడిగా నటిస్తాడా? లేక మరెవరైనా చేస్తారా అన్నది చూడాలి.

ఇవీ చూడండి.. 'నిన్నే పెళ్లాడతా' లోగో ఆవిష్కరించిన కింగ్ నాగార్జున

ABOUT THE AUTHOR

...view details