మనం ఎక్కడికైనా తెలియని ప్రాంతానికి లేదా మొదటిసారి స్నేహితుడి ఇంటికి వెళ్లాలన్నా సరే.. లొకేషన్ ఆధారంగా గూగుల్ మ్యాప్స్ సాయం తీసుకుంటాం. మ్యాప్స్ ఆధారంగా గమ్యస్థానానికి త్వరగా చేరుకుంటాం. అయితే, కొన్నిసార్లు మ్యాప్స్ ఉపయోగించినప్పటికీ కన్ఫ్యూజన్‌తో దారి తప్పుతాం. ఇలాంటి ఎన్నో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపొందించిన యాప్.. 'వాట్ 3 వర్డ్స్' (what3words) అని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath).
Puri Musings: 'వాట్ 3 వర్డ్స్' యాప్ గురించి తెలుసా..? - వాట్ 3 వర్డ్స్ యాప్
'పూరీ మ్యూజింగ్స్' ద్వారా పలు విషయాలపై తన అభిప్రాయలను పంచుకుంటూ, కొత్త విషయాలను చెబుతూ వస్తున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath). తాజాగా ఆయన 'వాట్ 3 వర్డ్స్'(what3words) అనే యాప్ గురించి వివరించారు.
పూరీ మ్యూజింగ్స్
తాజాగా పూరీ జగన్నాథ్ 'వాట్ 3 వర్డ్స్' యాప్ గురించి 'పూరీ మ్యూజింగ్స్' వేదికగా తెలియజేశారు. ఈ యాప్ సాయంతో చిట్టడవుల్లో చిక్కుకున్నా సరే సురక్షితంగా బయటకు చేరుకోవచ్చని ఆయన చెప్పారు. యాప్ వినియోగం గురించి తెలియజేశారు. ప్రస్తుతానికి ఈ యాప్ 26 భాషల్లో అందుబాటులో ఉందని.. అతి త్వరలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా రానుందని ఆయన వివరించారు. అలాగే ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని పూరీ సూచించారు.