తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందరి పేర్లు బయటపెడతా: పూరీ జగన్నాథ్ - నిధి అగర్వాాల్

ఇండస్ట్రీలో తనని ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లను త్వరలో బయటపెడతానని అంటున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. డిపార్ట్​మెంట్లతో సహా వెల్లడిస్తానని చెప్పాడు.

అందరి పేర్లు బయటపెడతా: పూరీ జగన్నాథ్

By

Published : Jul 31, 2019, 6:30 AM IST

తనని ఇప్పటివరకు ఇబ్బందులు పెట్టిన వారందరి పేర్లు బయటపెడతానని అన్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇటీవలే 'ఇస్మార్ట్​ శంకర్'​తో హిట్ కొట్టి ఫామ్​లోకి వచ్చాడు. ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ డైరక్టర్​ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నిర్మాతగా చాలా కష్టాలు ఎదుర్కోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

"దర్శకుడిగా నేను ఇబ్బంది పడలేదు. కానీ నిర్మాతగా దారుణమైన కష్టాలు అనుభవించా. నాకే కాదు ఏ నిర్మాతకైనా బాధలు తప్పవు. ఓ సినిమా తీస్తున్నప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆడుకుంటారు. వారిని రకరకాలుగా బాధకు గురిచేస్తారు. ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఆ నిర్మాతలు ఏడుస్తుంటారు. ఈ కష్టాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారే నా జీవితంలోనూ ఉన్నారు. వారందరి పేర్లు త్వరలోనే బయటపెడతా. ఎవరెవరు నన్నెలా ఆడుకున్నది డిపార్ట్‌మెంట్లతో సహా వెల్లడిస్తా" -పూరీ జగన్నాథ్, దర్శకుడు

ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద దుమ్ముదులుపుతున్న 'ఇస్మార్ట్ శంకర్'.. రూ.63 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చాలా ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథ్​కు ఓ విజయాన్ని అందించింది.

ఇది చదవండి: బీచ్​లో చచ్చిపోవాలనేది తన చివరి కోరికని చెప్పిన దర్శకుడు పూరీ జగన్నాథ్

ABOUT THE AUTHOR

...view details