తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పూరీ ఇంక సెలవు తీసుకుంటాడట.. - puri jagannath

'ఇస్మార్ట్ శంకర్'​తో మంచి విజయాన్ని అందుకున్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొన్నిరోజులు విరామం తీసుకోనున్నాడట. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టు మొదలుపెడతాడని సమాచారం.

పూరి

By

Published : Jul 22, 2019, 9:52 AM IST

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఇక ప్రశాంతంగా సెలవు తీసుకుంటానంటున్నాడు. అదేంటి.. ఆయన మెగా ఫోన్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడా? అని కంగారు పడకండి. ఎందుకంటే ఆయన తీసుకునేది మీరనుకునే సెలవు కాదు. కొన్నాళ్లు ప్రశాంతంగా హాలీడే ట్రిప్‌కు వెళ్లనున్నాడు.

కొన్నేళ్లుగా ఎదురవుతున్న వరుస పరాజయాలకు ఎట్టకేలకు 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో చెక్‌ పెట్టేశాడు పూరీ. రివ్యూల పరంగా ఈ చిత్రానికి మిశ్రమ ఫలితం దక్కినా.. కమర్షియల్‌గా భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ రెండు నెలల పాటు ప్రశాంతంగా విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు పూరీ. అంతేకాదు.. ఈ విరామంలో గట్టిగా కసరత్తులు చేసి పాత పూరి మాదిరిగా హుషారుగా మారిపోవాలని బలంగా నిశ్చయించుకున్నాడట.

విహార యాత్ర పూర్తయిన తర్వాతే తన తర్వాతి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు పూరీ. మరి ఇది 'డబుల్‌ ఇస్మార్ట్‌' ప్రాజెక్టు అవుతుందా? లేక మరేదైనా కొత్త చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది. రామ్‌ రెడీ అంటే మాత్రం పూరీ తర్వాతి ప్రాజెక్టు 'ఇస్మార్ట్‌ శంకర్‌' సీక్వెలే అవుతుంది.

ఇవీ చూడండి.. నెట్​ఫ్లిక్స్​ వెబ్​సిరీస్​లో అనుష్క శర్మ

ABOUT THE AUTHOR

...view details