మాస్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు సినిమా ఆఫర్ ఇచ్చాడు. మహేశ్ 'పోకిరి' డైలాగ్ టిక్‌టాక్ చేసిన వార్నర్.. నేడు ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన పూరీ.. భవిష్యత్‌లో కుదిరితే తన సినిమాలో అతడికి అతిథి పాత్ర ఇస్తానని రాసుకొచ్చాడు.
'డేవిడ్ వార్నర్ ఇది నువ్వేనా! ఈ డైలాగ్ నీ బాడీ లాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయింది. నువ్వు నటుడిగా కూడా రాణించగలవు. భవిష్యత్‌లో కుదిరితే నా సినిమాలో అతిథి పాత్ర ఇస్తా. లవ్యూ' -పూరీ జగన్నాథ్, దర్శకుడు