విదేశాల్లో ఎంతోమంది ప్రజలు వ్యాన్స్‌లోనే జీవనం సాగిస్తున్నారని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. 18 శతాబ్దం నుంచే 'వ్యాన్ లైఫ్' ఉందని అన్నారు. తాజాగా ఆయన పూరీ మ్యూజింగ్స్ వేదికగా 'వ్యాన్ లైఫ్' గురించి ఎన్నో విశేషాలు బయటపెట్టారు. అలాగే మనకున్న కారుని ఎలా మార్చుకోవచ్చో తెలియజేశారు.
'వ్యాన్ లైఫ్' ఇప్పుడు మొదలైంది కాదు: పూరి - వ్యాన్ లైఫ్ గురించి పూరీ జగన్నాథ్
'పూరీ మ్యూజింగ్స్'తో పలు రకాల విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజాగా 'వ్యాన్ లైఫ్' అనే అంశం గురించి వివరించారు.
"ఎంతోమంది ప్రజలు వ్యాన్స్‌లోనే జీవిస్తున్నారు. అదే వాళ్లకి ఇల్లు. అందులోనే తింటారు. పడుకుంటారు. తక్కువ స్థలంలోనే అన్ని వస్తువులను సర్దుకుంటారు. ఈ వ్యాన్ లైఫ్ అనేది ఇప్పుడు మొదలైంది కాదు. 18వ శతాబ్దంలో వ్యాగన్స్‌కి గుర్రాలు కట్టి వాటిపై ప్రయాణించేవాళ్లు. బ్రిటిష్‌వాళ్లు ఎక్కువగా ఈ వ్యాగన్స్‌లోనే ప్రయాణించేవాళ్లు. అప్పట్లో ప్రజలు వాటిపై ఎక్కువగా మక్కువ చూపించారు కాబట్టే ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ప్రారంభమైంది. ఫోక్స్ వ్యాగన్ అంటే ప్రజల కార్లు అని అర్థం."
"కొన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లను కాంపర్వన్స్‌గా మార్చవచ్చు. యూఎస్‌లో పాతబడిన స్కూల్ బస్సులను తీసుకుని ఈ విధంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే వ్యాన్ లైఫ్ కోసం కాంపర్వన్స్ కొనకుండా మనకున్న కారుని మూడు అటాచ్‌మెంట్స్‌తో కాంపర్వన్‌గా మార్చవచ్చు. అవేంటంటే...1.వెహికల్ మోడల్ చెబితే దాని డిక్కీలోకి సరిపడా మొబైల్ కిచెన్స్ దొరుకుతాయి. 2. రూఫ్ టెంట్, 3. 270 డిగ్రీల అనింగ్. ఈ మూడు అటాచ్‌మెంట్స్‌తో వ్యాన్ లైఫ్‌కి సిద్ధం కావచ్చు. ఎన్నో మిలియన్ల మంది సంవత్సరాల తరబడి వ్యాన్ లైఫ్‌లో ఉన్నారు. వాళ్లకి ఒక కోట్ ఉంది హోమ్ ఈజ్ వేర్ యూ పార్క్ ఇట్"’ అని పూరీ వివరించారు