తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇస్మార్ట్​ దర్శకుడితో రౌడీ.. అంతా రెడీ

టాలీవుడ్​ యువ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు పూరీ జగన్నాథ్. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఇస్మార్ట్​ దర్శకుడితో రౌడీ.. అంతా రెడీ

By

Published : Aug 12, 2019, 3:54 PM IST

Updated : Sep 26, 2019, 6:25 PM IST

'ఇస్మార్ట్​ శంకర్'​తో హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్​.. తన తర్వాతి చిత్రంపై స్పష్టత ఇచ్చాడు. ఎప్పటి నుంచో వస్తున్న వార్తలను నిజం చేస్తూ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ ఫొటోల్ని ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఈ సినిమాను చార్మీతో కలిసి పూరీ కనెక్ట్స్​, పూరీ జగన్నాథ్ టూరింగ్​ టాకీస్ పతాకంపై సంయుక్తంగా నిర్మించనున్నాడు ఇస్మార్ట్ దర్శకుడు. ఇటీవలే హీరో రామ్​ను మాస్​ పాత్రలో చూపించాడు. ఇప్పుడు విజయ్​ దేవరకొండను ఎలా చూపిస్తాడోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. మహేశ్​తో తీయాల్సిన 'జనగణమన'ను ఈ కథానాయకుడితో తీస్తాడేమో అని ఫిల్మ్​నగర్​లో అనుకుంటున్నారు.

ఇది చదవండి: విజయ్ దేవరకొండతో పూరీ 'జనగణమన'

Last Updated : Sep 26, 2019, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details