మాస్ సినిమాలు తీయడంలో, హీరోలను డిఫరెంట్ లుక్స్‌లో చూపించడంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ సిద్ధహస్తుడు. మెగాస్టార్ చిరంజీవితో కలసి పనిచేయాలనిఈ డైరెక్టర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ అది కలగానే మిగిలిపోయింది. త్వరలో వీరి కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభం కానుందనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్న వీరిద్దరూ.. అవి పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారట. అప్పుడైనా షూటింగ్ మొదలవుతుందా? లేదా మరికొంత కాలం ఆగక తప్పదా? అనేది చూడాలి.
ఈ విషయమైన ఇటీవలే మాట్లాడిన పూరీ జగన్నాథ్.. తనకు చిరుతో పనిచేసే అవకాశం ఏకంగా నాలుగుసార్లు వచ్చినట్లే వచ్చి చేజారిందని అన్నాడు. రెండుసార్లు పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆగిపోయిందని అన్నాడు.