తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పూరీ, ఛార్మి 'ఇస్మార్ట్' సక్సెస్​కు స్మార్ట్ కార్లు - 'ఇస్మార్ట్​ శంకర్'​

'ఇస్మార్ట్​ శంకర్'​ విజయంతో ఫుల్​ జోష్​లో ఉన్నారు ఆ చిత్ర నిర్మాతలు ఛార్మి, పూరీ జగన్నాథ్. ఈ ఆనందంలో వీరిద్దరూ రెండు లగ్జరీ కార్లను కొని ఫొటోలకు ఫోజులిచ్చారు.

పూరీ, ఛార్మి

By

Published : Sep 17, 2019, 4:05 PM IST

Updated : Sep 30, 2019, 11:05 PM IST


పూరీ కనెక్ట్స్(పీసీ)​ బ్యానర్​పై తెరకెక్కిన 'ఇస్మార్ట్​ శంకర్'​ సూపర్ హిట్ అయింది. వాణిజ్యపరంగానూ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్​ చేస్తున్నారు పూరీ, ఛార్మి. ఈ ఆనందంలో రెండు కార్లను కొనుగోలు చేశారు. రేంజ్​ రోవర్​ వోగ్​ను పూరీ, బీఎమ్​డబ్ల్యూ-7 సిరీస్​ను ఛార్మి తీసుకున్నారు. ఈ రెండూ ఒకేసారి ఇంటికి వచ్చిన ఆనందంలో ఫొటోలు దిగి అభిమానులతో పంచుకున్నారు.

పూరీ, ఛార్మి 'ఇస్మార్ట్' కార్లు

ప్రస్తుతం విజయ్​ దేవరకొండతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్​. ఈ సినిమానూ వీరిద్దరే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: 'సత్యాగ్రహి' అందుకే చేయలేదు: పవన్ ​

Last Updated : Sep 30, 2019, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details