తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూపర్​స్టార్ మహేశ్​ కోసం పంజాబీ సింగర్ - స్టూడియోలో పరాక్​తో దేవిశ్రీ ప్రసాద్

'సరిలేరు నీకెవ్వరు'లో సూర్యుడివో చంద్రుడివో పాటను పంజాబీ సింగర్ పరాక్ పాడాడు. ఈ పాటతో దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. ఇన్​స్టా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

సూపర్​స్టార్ మహేశ్​ కోసం పంజాబీ సింగర్
పంజాబీ సింగర్ పరాక్

By

Published : Dec 8, 2019, 7:23 PM IST

"సంగీతానికి భాషతో సంబంధం లేదు. తనపై నమ్మకముంచి ఈ అవకాశమిచ్చిన దేవిశ్రీప్రసాద్​కు థాంక్స్" అంటూ ఇన్​స్టా వేదికగా ఆనందాన్ని పంచుకున్నాడు పంజాబీ సింగర్ పరాక్. సూపర్​స్టార్ మహేశ్​బాబు​ 'సరిలేరు నీకెవ్వరు'లో సూర్యుడివో చంద్రుడివో అంటూ సాగే గీతాన్ని పాడాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు.

పంజాబీ సింగర్ పరాక్ ఇన్​స్టా పోస్ట్

"సౌత్ ఇండస్ట్రీ కింగ్ దేవిశ్రీప్రసాద్​తో తొలిసారి పనిచేయడం నిజంగా గొప్ప అనుభవం. నాకు ఈ అవకాశం ఇచ్చినందకు డీఎస్​పీ సర్​కు చాలా థాంక్స్. సంగీతానికి భాషతో సంబంధం లేదనడానికి ఇదే నిదర్శనం" -ఇన్​స్టాగ్రామ్​లో పరాక్

సోమవారం సర్​ప్రైజ్​గా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి సూర్యుడివో చంద్రుడివో లిరికల్ రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్​ ఆసక్తి రేపుతోంది. ఇందులో రష్మిక హీరోయిన్​. విజయశాంతి, ప్రకాశ్​రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

స్టూడియోలో పరాక్​తో దేవిశ్రీ ప్రసాద్
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్​బాబు-విజయశాంతి

ఇది చదవండి: గ్యాంగ్​స్టర్​ కథతో సూపర్​స్టార్ మహేశ్​బాబు!

ABOUT THE AUTHOR

...view details