కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. గత నెల29న కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసిన పునీత్ మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది అభిమానులు ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేందుకు వస్తున్నారు. నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. పునీత్ భార్య అశ్విని (Puneeth Rajkumar wife) ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ లేఖను పోస్ట్ చేశారు. ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండని ఆమె.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ (Puneeth Rajkumar wife instagram) ఓపెన్ చేసి తొలిపోస్టును పునీత్‌కు అంకితమిచ్చారు.
'ఆయనెప్పుడూ జీవించే ఉంటారు'.. పునీత్ భార్య భావోద్వేగపు లేఖ - పునీత్ రాజ్‌కుమార్ భార్య ఇన్‌స్టాగ్రామ్
పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపు లేఖను పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండని ఆమె.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తొలిపోస్టును పునీత్‌కు అంకితమిచ్చారు.
"శ్రీ పునీత్ రాజకుమార్ అకాల మరణం మా కుటుంబ సభ్యులకే కాదు.. మొత్తం కర్ణాటక ప్రజలకు షాకింగ్‌గా ఉంది. ఆయన్ను 'పవర్‌స్టార్' చేసిన అభిమానులకు పునీత్ లేనిలోటు ఊహించడం కష్టమే. ఈ బాధలో మీరు మనోనిబ్బరం కోల్పోకుండా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలకు తావివ్వకుండా, గౌరవంగా పునీత్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. సినీప్రియులు మాత్రమే కాకుండా భారతదేశంతో పాటు విదేశాల నుంచి ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు. అప్పు(పునీత్)ని వేలాది మంది ఫాలో అవ్వడం, ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం.. మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయనను ఆదర్శంగా తీసుకొని మీరు చేసే మంచి పనుల్లో పునీత్ జీవించే ఉంటారు .మీ ప్రేమ, మద్దతు కోసం మా మొత్తం కుటుంబం తరఫున అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు
ఇట్లు,
అశ్విని పునీత్ రాజ్‌కుమార్