కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణం చాలామందికి షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే ఓ మంచి నటుడే కాదు అంతకు మించిన గొప్ప మనిషిని కోల్పోయామనే బాధ. ఆయన ఇకలేరు, మరి సినిమాలు చేయరు అంటే ఏదో తెలియని వెలితి.
వెండితెరపై కథానాయకుడిగా, నటుడిగా ఎందరో మనసుల్ని గెలిచారు. బయటకూడా చాలామంచి పనులు చేసి ప్రజల్ని హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు.
ఇంతకీ ఏమేం చేశారంటే?
45 ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు. 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధ ఆశ్రమాలు, 19 గోశాలు ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకున్నారు.
మరణానంతరం తన రెండు కళ్లను దానం చేసిన గొప్ప వ్యక్తి పునీత్ రాజ్‌కుమార్. అందుకే కన్నడ ప్రేక్షకులకు ఆయనంటే అంత అభిమానం. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా ఆ నిజమైన హీరో మరణవార్త విని తల్లడిల్లిపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఇవీ చదవండి: