Punith rajkumar death: 10 మంది పునీత్ ఫ్యాన్స్ మృతి, ఒకరు ఆస్పత్రిలో - పునీత్ రాజ్‌కుమార్ లేటెస్ట్ న్యూస్
పునీత్ మరణాన్ని తట్టుకోలేక ఫ్యాన్స్ తుదిశ్వాస విడుస్తున్నారు. కొందరు ఉరి వేసుకుని, మరికొందరు గుండెపోటుతో మరణించారు. మరో అభిమాని ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు.

పునీత్ రాజ్‌కుమార్
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం చాలామందిని షాక్‌కు గురిచేసింది. పలువురు నటీనటులతో పాటు ప్రజలు, అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఈయన మృతిని తట్టుకోలేక కర్ణాటకకు చెందిన ఆరుగురు ఫ్యాన్స్ మరణించగా, మరో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మరో అభిమానికి గుండెపోటు రావడం వల్ల అతడిని ఆస్పత్రిలో చేర్చారు.
- బెల్గావి జిల్లాలోని అతనీ నగరానికి చెందిన రాహుల్(22).. పునీత్ ఫొటో ముందే ఉరి వేసుకుని శనివారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. చిక్కుమగళూరు చెందిన శరత్(30) కూడా ఉరి వేసుకుని మృతిచెందారు. .
- సింధోలి గ్రామానికి చెందిన పరశురామ హనుమంత(33).. పునీత్ మరణవార్త విని గుండెపోటుతో శనివారం ఉదయం మరణించారు. మరూర్ గ్రామానికి చెందిన మునియప్ప(28) రైతు. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన అతడు.. పునీత్ మరణవార్తను టీవీలో చూసి తట్టుకోలేకపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. .
- హోన్నూర్ గ్రామానికి చెందిన గణేశ్(22).. పునీత్ కన్నుమూతను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో బ్లేడ్‌తో చేయి కోసుకుని మృతి చెందాడు.
- రాయ్‌చూర్ జిల్లాకు చెందిన బసవన్నగౌడ(28), మహమ్మద్ రఫీ(28).. పునీత్ ఇక లేరన్న విషయాన్ని నమ్మలేకపోయారు. దీంతో ఆత్మహత్య చేసుకుని మరణించారు. విజయపురకు చెందిన శరనప్ప బిసనల్(24).. డయాబెటిస్ టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుని ప్రాణాలు వదిలాడు. .
- మండ్యలోని ఎలదహల్లి గ్రామానికి చెందిన వైఎస్ సురేశ్(45).. పునీత్ మరణవార్తను టీవీలో చూస్తూ గుండెపోటుతో చనిపోయారు.
- మైసూర్ కేఆర్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ అశోక్(40) పునీత్ మరణంతో మానసికంగా కలత చెందారు. దీంతో కాలువలో దూకి తన ప్రాణాలు వదిలేశారు.
- చిక్కమగళూరుకు చెందిన ప్రో-కన్నడ తాలుకా ప్రెసిడెంట్ ఆదిమూర్తి రెడ్డికి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆస్ప్రత్రిలో ఉన్నారు. ..