కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఫేవరెట్ హీరో సినిమాలు ఇకపై వెండితెరపై చూడలేమని చాలా బాధపడుతున్నారు. అయితే పునీత్ చివరి సినిమా 'జేమ్స్'ను(james movie kannada) ఆయన జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఓ ఫైట్ సీక్వెన్స్ మినహా మొత్తం టాకీపార్ట్‌ను పునీత్(puneeth rajkumar death) ఇప్పటికే పూర్తి చేశారు. సాంకేతికంగా కొన్ని సవాళ్లు.. ముఖ్యంగా పునీత్ పాత్రకు డబ్బింగ్ లాంటి అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పూర్తిచేసి తీరతామని చిత్రబృందం ధీమాగా ఉంది.