Puneeth James teaser: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరగా నటించిన సినిమా 'జేమ్స్'. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 17న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అన్ని భాషల టీజర్లనూ శుక్రవారం ఉదయం రిలీజ్ చేశారు.
ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఉన్న టీజర్.. పునీత్ ఫ్యాన్స్‌నే కాకుండా సినీ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో తెలుగు నటుడు శ్రీకాంత్.. కీలకపాత్ర పోషించారు. ప్రియా ఆనంద్ హీరోయిన్గా చేసింది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు.