Puneeth rajkumar amazon prime: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్.. గతేడాది అక్టోబరు 19న గుండెపోటుతో మరణించారు. చిన్న వయసులోనే ఆయన తనువు చాలించడాన్ని అభిమానుల్ని తట్టుకోలేకపోయారు. కొన్నిరోజులపాటు ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయారు. సాధారణ ప్రజలతో పాటు స్టార్ సెలబ్రిటీల వరకు పునీత్‌కు ఘనంగా నివాళి అర్పించారు.
ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా తనదైన రీతిలో నివాళి ఇచ్చేందుకు సిద్ధమైంది. పునీత్ నటించిన ఐదు సినిమాలను ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అభిమానులు, యాప్‌లో ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. అలానే పునీత్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న మూడు కొత్త సినిమాలు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'వన్ కట్ టూ కట్', 'ఫ్యామిలీ ప్యాక్' కూడా తమ ఓటీటీలోనే విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.