Puneeth Rajkumar Biopic: కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నటుడిగా మెప్పించడమే కాదు.. నిజజీవితంలో తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారాయన.
ఇటీవలే పునీత్ అభిమాని సునీల్ ట్విట్టర్ వేదికగా పునీత్ బయోపిక్ చేయాలంటూ దర్శకుడు సంతోష్‌ను కోరారు. "సర్.. ప్లీజ్ అప్పు(పునీత్) సర్ మీద ఓ బయోపిక్ తీయండి. అప్పును దగ్గరి నుంచి చూశారు. ఆయన ప్రేమించే విధానం, పాటించే నైతిక విలువల గురించి మీకు ఎన్నో విషయాలు తెలుసు. అలాంటి మీరు దయచేసి అప్పు సర్ జీవితాన్ని తెర మీద చూపించండి" అంటూ ట్వీట్ చేశాడు. వెంటనే ఆ ట్వీట్‌కు స్పందించిన దర్శకుడు సంతోష్.. "అప్పు సర్ ఎప్పటికీ బతికే ఉంటారు. తెరమీద ఆయన జీవితాన్ని చూపించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా" అంటూ బదులిచ్చారు.