*ఇటీవల మరణించిన అగ్రకథానాయకుడు పునీత్ రాజ్‌కుమార్‌కు సంతాపం తెలియజేస్తూ 'పునీత్ గీత నామన' పేరుతో ఈ రోజు(నవంబరు 16) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పునీత్‌కు నివాళిగా మంగళవారం షూటింగ్‌లు, ఇతర కార్యకలాపాలన్నీ నిలిపివేశారు.
*మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ ఈవెంట్.. దాదాపు మూడు గంటలపాటు జరగనుంది.
*బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి శాండల్‌వుడ్ సెలబ్రిటీలతో పాటు తెలుగు హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్‌తో పాటు తమిళ కథానాయకుడు సూర్య తదితరులు హాజరు కానున్నారు.
*కరోనా ప్రభావం కారణంగా 'పునీత్ గీత నామన' కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరవుతారు.