తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పునీత్​ స్ఫూర్తితో కళ్లను దానం చేస్తున్న ఫ్యాన్స్​ - పునీత్​ రాజ్​కుమార్​

మరణానంతరం(puneeth rajkumar eye transplant) తన కళ్ల ద్వారా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ను ఆదర్శంగా తీసుకున్న అభిమానులు ఆయన బాటలోనే నడుస్తున్నారు. తమ నేత్రాలను దానం చేసేందుకు వందలమంది ఫ్యాన్స్​ ఆస్పత్రి బయట క్యూ కడుతున్నారు.

puneeth
పునీత్​

By

Published : Nov 6, 2021, 10:41 AM IST

గుండెపోటుతో(puneeth rajkumar heart attack) అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిన కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్(అప్పు, puneeth rajkumar eye transplant)​.. బెంగళూరు నారాయణ నేత్రాలయకు తన కళ్లను దానం(eye donation) చేసి ఆదర్శంగా నిలిచారు. అప్పు మరణానంతరం ఆ నేత్రాల ద్వారా వైద్యులు ఓ మహిళతో పాటు మరో ముగ్గురికి చూపు వచ్చేలా చేశారు. ఇప్పుడు ఆయన నుంచి స్ఫూర్తి పొందిన అభిమానులు పునీత్​ తరహాలోనే తమ కళ్లను దానం చేస్తున్నారు(puneeth rajkumar eyes). వందలమంది ఫ్యాన్స్​ తమ నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్నారని నారాయణ నేత్రాలయ ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే చాలా మంది రిజిస్ట్రేషన్​ చేసుకున్నారని వెల్లడించారు.

పునీత్​ సమాధిని సందర్శించిన అనంతరం నేరుగా తమ హాస్పిటల్​కు అభిమానులు తరలివస్తున్నారని డాక్టర్​ బుజంగా శెట్టి తెలిపారు. మొదట కేవలం ముగ్గురు లేదా నలుగురు మాత్రమే తమ కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చారని.. కానీ ఆ తర్వాత సంఖ్య క్రమక్రమంగా 200కుపైగా చేరిందని అన్నారు.

తండ్రి బాటలోనే

తన తండ్రి సీనియర్​ నటుడు రాజ్​కుమార్​ను ఆదర్శంగా తీసుకున్న పునీత్‌.. కెరీర్​లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్‌కుమార్‌ మాదిరిగానే పునీత్‌ కూడా మరణానంతరం తన కళ్లను దానం చేశారు.

అకస్మాతుగా

అక్టోబర్​ 29న ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్​కు అకస్మాతుగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలు భాషలకు చెందిన నటీనటులు.. పునీత్​ ఇంటికి చేరుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఇదీ చూడండి:

పునీత్​ నేత్రదానంతో ఆ నలుగురి జీవితాల్లో వెలుగు

తండ్రిలానే పునీత్​ రాజ్​కుమార్​.. 2006లోనూ ఇలాగే!

ABOUT THE AUTHOR

...view details