యువనటి ఈశ్వరి దేశ్‌పాండే(Ishwari Deshpande News) రోడ్డుప్రమాదంలో మృతిచెందింది. పుణెకు చెందిన ఈమె.. తన బాయ్‌ఫ్రెండ్ శుభమ్ దెడ్జేతో కలిసి వారం క్రితం గోవా వెళ్లింది. అక్కడ ఓ పార్టీకి వెళ్లి, తిరిగి వస్తుండగా.. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు గోవాలోని కలన్‌గుటే వద్ద ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు బాగా కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఈశ్వరి(Ishwari Deshpande News), ఆమె బాయ్‌ఫ్రెండ్ శుభమ్ దెడ్గే అక్కడికక్కడే చనిపోయారు.
యువనటి దుర్మరణం.. పార్టీ నుంచి తిరిగి వస్తుంటే..
గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పుణెకు చెందిన నటి ఈశ్వరి దేశ్‌పాండే(Ishwari Deshpande News) మరణించింది. ఓ వేడుకలో పాల్గొనేందుకు తన ప్రియుడు శుభమ్‌తో కలిసి అక్కడికి వెళ్లగా.. తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదానికి గురై వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి
ఈశ్వరి(Ishwari Deshpande Movies) ఇటీవల మరాఠీ, హిందీలో పలు చిత్రాల్లో నటించింది. ఈశ్వరి, శుభమ్.. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మరికొద్ది నెలల్లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు.
Last Updated : Sep 22, 2021, 12:49 PM IST