ఎట్టకేలకు తన నిశ్చితార్థం విషయాన్ని బయటపెట్టింది నటి పునర్నవి. ఆహా ఓటీటీ వేదికగా రానున్న 'కమిట్ మెంటల్' వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు స్పష్టం చేసింది. నిశ్చితార్థం అయిన మాట నిజమే కానీ అను, ఫనీకి అంటూ సంబంధిత వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు నటుడు శ్రీ విష్ణు.
ఇంతకుముందు ఇన్‌స్టా వేదికగా నిశ్చితార్థం అయినట్లు ఫొటోలు పెట్టి అభిమానులను కలవరపెట్టిన పునర్నవి.. 'ఎట్టకేలకు ఇది జరుగుతోంది' అనే కామెంట్‌తో తన పెళ్లి ఖరారైనట్లే నమ్మించింది. కానీ, ఈ నిశ్చితార్థం నిజమైందని కాదని తెలిసిన తర్వాత నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.