తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పునర్నవిది నిశ్చితార్థమా? లేదా ప్రచారమా? - పునర్నవి నిశ్చితార్థం వార్తలు

యువనటి​ పునర్నవితో ఉద్భవ్​ రఘునందన్​ అనే వ్యక్తితో నిశ్చితార్థం అయ్యిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరోవైపు తన జీవితంలో ఓ ముఖ్యమైన విషయాన్ని శుక్రవారం వెల్లడిస్తానని తాజాగా పునర్నవి వెల్లడించింది. అయితే నెట్టింట జరుగుతున్న ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది.

punarnavi bhupalam share Udbhav Raghunandan photo
పునర్నవిది నిశ్చితార్థమా? లేదా ప్రచారమా?

By

Published : Oct 30, 2020, 5:38 AM IST

'ఎట్టకేలకు ఇది జరుగుతోంది'అంటూ నిశ్చితార్థ ఉంగరం ధరించిన చేతిని అభిమానులతో పంచుకున్న నటి పునర్నవి మరో ఆసక్తికర ఫొటోను గురువారం సాయంత్రం ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. 'అతనికి యస్‌ చెప్పాను' అంటూ ఉద్భవ్‌ రఘునందన్‌ అనే వ్యక్తిని ట్యాగ్‌ చేస్తూ తన జీవితంలో గొప్ప రోజు గురించి శుక్రవారం వెల్లడిస్తానని తెలిపారు. దీంతో అటు ఆమె అభిమానుల్లోనూ, ఇటు నెటిజన్లలోనూ ఆసక్తి నెలకొంది.

పునర్నవి ట్యాగ్ చేసిన ఉద్భవ్‌ రఘునందన్‌/అలియాస్‌ పృథ్వీరాజ్‌ ఇన్‌స్టాలోనూ వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు. 'ఆమె నాకు అవునని చెప్పింది. రేపు మీకొక విషయం చెప్పడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నాను' అని పేర్కొన్నారు. రఘునందన్‌ కూడా రచయితగా, నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన పలు వెబ్‌సిరీస్‌ల్లో నటించారు.

బుధవారం రాత్రి వేలికి ఉంగరం ఉన్న చేతి ఫొటోను అభిమానులతో షేర్‌ చేయడం వల్ల పునర్నవికి ఎంగేజ్‌మెంట్‌ అయినట్లు అభిమానులు భావించారు. అయితే, పూర్తి వివరాలను అక్టోబరు 30న చెబుతానని ఆమె పేర్కొనడం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజంగా ఆమెకు నిశ్చతార్థం అయిందా? లేక ఏదైనా సినిమా/వెబ్‌ సిరీస్‌ ప్రచారంలో భాగంగా ఈ ఫొటోలను పంచుకున్నారో తెలియాలంటే శుక్రవారం వరకూ వేచి చూడాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details