వరుసగా స్టార్ హీరోల చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ భామ.. తాజాగా పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌తో నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ సినిమా 'పింక్' రీమేక్‌తో పవర్ స్టార్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.హిందీలో తాప్సీ పోషించిన పాత్ర కోసం పూజా హెగ్డేని సంప్రదించారట చిత్రబృందం.ఇందుకు ఆమె కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పూజా.
పవన్ కల్యాణ్ 'పింక్'లో పూజా హెగ్డే..! - puja hegde
బాలీవుడ్ చిత్రం 'పింక్' రీమేక్‌లో పూజా హెగ్డే నటించనుందట. హిందీలో తాప్సీ పోషించిన పాత్ర కోసం ఆమెను సంప్రదించిందట చిత్రబృందం. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
పూజా హెగ్డే
పింక్ చిత్రాన్ని దిల్‌రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా తెలుగులో రీమేక్ చేయనున్నారు. యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించనున్నాడు. న్యాయస్థానం నేపథ్యంలో సాగనుందీ చిత్రకథ. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.
ఇదీ చదవండి: రానాతో స్నేహమే... డేటింగ్‌లో లేను: రకుల్