'గబ్బర్‌సింగ్' తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో మరో ట్రెండ్ సెట్టింగ్ సినిమాకు రంగం సిద్ధమైంది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న ఆయన అభిమానులకు ఓ శుభవార్త వినిపించబోతున్నారు దర్శకుడు హరీశ్ శంకర్.
పవన్ పుట్టినరోజు సర్ప్రైజ్పై హరీశ్ శంకర్ క్లారిటీ - Mythri movie makers
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు దర్శకుడు హరీశ్ శంకర్. ఈ సందర్భంగా పవన్ 28వ చిత్రానికి సంబంధించి టైటిల్ లేదా ప్రాజెక్టు వివరాలను వెల్లడించనుంది చిత్రబృందం.
![పవన్ పుట్టినరోజు సర్ప్రైజ్పై హరీశ్ శంకర్ క్లారిటీ PSPK 28 Update on Pawan Kalyan's 49th Birthday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8633780-944-8633780-1598930221532.jpg)
పవన్ చేయబోతున్న 28వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను పవన్ బర్త్‌డే రోజు సాయంత్రం 4:05 గంటలకు ప్రకటించనున్నట్లు నిర్మాణసంస్థ మైత్రీ మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లేదా పవన్‌కు జోడిగా నటించబోయే హీరోయిన్ వంటి వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
పవన్ కల్యాణ్.. ప్రస్తుతం 'వకీల్ సాబ్', క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తవ్వగానే దర్శకుడు హరీశ్ శంకర్‌తో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మరోవైపు సునీల్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వేదాంతం రాఘవయ్య' సినిమా రూపొందనుందని ఇటీవలే ప్రకటన వచ్చింది.