మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సినిమా చూస్తూ ఏడ్చేశారట. ఆ విషయాన్ని సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'సామ్ జామ్'లో చెప్పారు. తన ఫ్రిజ్‌లో ఓ ఐటెమ్ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అలానే కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఫ్లిఫ్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. వీటన్నింటిని చూడాలంటే ఈనెల 25 వరకు ఆగాల్సిందే. ఆరోజే చిరు పాల్గొన్న ఎపిసోడ్ 'ఆహా' ఓటీటీలో విడుదలవుతుంది.
కళ్లకు గంతలు కట్టుకుని చిరు దోశ ఛాలెంజ్! - megastar Chiranjeevi's Flip-Dosa Challenge
'సామ్ జామ్'లో అగ్ర కథానాయకుడు చిరంజీవి పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో పలు ఆసక్తికర విషయాలతో పాటు క్రేజీ సంగతుల్ని ఆయన చెప్పారు.
కళ్లకు గంతలు కట్టుకుని చిరు దోశ ఛాలెంజ్!
ప్రస్తుతం 'ఆచార్య' చిత్రీకరణలో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. ఇందులో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. మణిశర్మ సంగీత దర్శకుడు. కొరటలా శివ దర్శకత్వం వహించారు. వచ్చే వేసవిలో థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.
Last Updated : Dec 22, 2020, 10:41 AM IST