Project K Movie: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ కోసం హాలీవుడ్లో ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఇలాంటిది గతంలో ఏ భారత నటుడికీ జరగలేదని వెల్లడించారు. ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దత్ నిర్మాణంలో 'ప్రాజెక్ట్ కే' చిత్రం తెరకెక్కుతుంది. నాగ్ అశ్విన్ దర్శకుడు. దీపిక పదుకొణె హీరోయిన్. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు అశ్వనీదత్.
"హాలీవుడ్ నటులు, దర్శకులు.. ఒక భారత యాక్టర్ కోసం ఇంత ఎంక్వైరీ చేయడం ఎవ్వరికీ జరగలేదు. ప్రభాస్‌కు జరిగింది. నేను కచ్చితంగా చెప్పగలను.. 'ప్రాజెక్ట్ కే' తర్వాత ప్రభాస్.. కేవలం ఇంగ్లీష్ సినిమాలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు."
- అశ్వనీదత్, నిర్మాత
రిలీజ్ ఎప్పుడంటే?