తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జయం మనదేరా' క్లైమాక్స్​ అలా ఫిక్సయింది! - జయం మనదేరా వెంకటేశ్

వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'జయం మనదేరా'. అప్పట్లో ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో మీరూ తెలుసుకోండి!

Produsers plan two climax scenes for Jayam Manadhera movie
'జయం మనదేరా' క్లైమాక్స్​ అలా ఫిక్సయింది!

By

Published : Dec 1, 2020, 10:33 AM IST

'జయం మనదేరా!'.. వెంకటేష్‌ నట విశ్వరూపం చూపించిన చిత్రం. పవర్‌ఫుల్‌ గెటప్‌లో ఆయన పేల్చిన డైలాగులు ఎప్పటికీ మరువలేం. ఎన్‌.శంకర్‌ దర్శకత్వంలో వెంకీ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది.

నచ్చితేనే పేరు..

వందేమాతరం శ్రీనివాస్‌ అందించిన సంగీతం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులోని ప్రతిపాట శ్రోతల్ని ఊపేసింది. ఇప్పటికీ ఏదో సందర్భంలో ఈ గీతాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా సినిమా విడుదలయ్యాక తెలిసిన విషయం. మరి సినిమా విడుదలకు ముందు సంగీతం విషయంలో ఏమైందంటే.. చిత్ర దర్శకుడు శంకర్‌, వందేమాతరం శ్రీనివాస్‌ చాలాసార్లు కలిసి పనిచేశారు. అందుకే ఈ చిత్రానికి ఆయన్నే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనుకుని, ఆ మాటను వెంకీకి చెప్పగా "శ్రీనివాస్‌ విప్లవ గీతాలు ఎక్కువగా ఇస్తారు కదా! ఈ సినిమా చేయగలరా" అని అన్నారట. "మీరిచ్చే సంగీతం నచ్చితే మీ పేరు వేస్తాం. లేకపోతే వేయం" అని నిర్మాణ సంస్థ ఓ షరతు పెట్టింది. దాన్ని స్వీకరించి తానేంటో తన సంగీతంతోనే నిరూపించుకున్నారు శ్రీనివాస్‌.

వెంకటేష్, సౌందర్య

సమయం లేకపోవడం వల్ల..

క్లైమాక్స్‌ విషయంలోనూ విభేదాలు తలెత్తాయి. శంకర్‌ రాసుకున్న క్లైమాక్స్‌ వెంకీకి వినిపించగా.. "కొంచెం మాస్‌ నేపథ్యంలో ఉంటే బాగుంటుంది. ఓ హిందీ చిత్రంలో ఉన్నట్లు చేద్దామని" సలహా ఇచ్చారు. నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌ ఓ నిర్ణయానికొచ్చింది. రెండు రకాలుగా చిత్రీకరిద్దాం. ఏది బాగుంటే అదే ఓకే చేద్దాం అనుకుంది. ముందుగా హిందీ చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. సమయం లేకపోవడం వల్ల రెండో భాగం షూట్‌ చేయలేదు. దాంతో హిందీ చిత్రం ఆధారంగా షూట్‌ చేసిన సన్నివేశాన్నే విడుదల చేశారు. ఈ చిత్రంలో వెంకీ సరసన భానుప్రియ, సౌందర్య కనిపించి అలరించారు.

ABOUT THE AUTHOR

...view details