తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఒక్క రోజు ఆలస్యమైనా.. కిక్కు మాత్రం గ్యారంటీ' - karthikeya 90ml will release on december 6th

హీరో కార్తికేయకు 'ఆర్ఎక్స్​ 100'తో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై వస్తోన్న చిత్రం '90ఎంఎల్'. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం.

90ml
90ఎంఎల్

By

Published : Dec 5, 2019, 12:08 PM IST

టాలీవుడ్ యువ హీరో కార్తికేయ, నేహా సోలంకి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '90ఎంఎల్'. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలకు, ప్రమోషనల్ టూర్లకు, ప్రీ రిలీజ్ ఈవెంటుకు ఇప్పటికే అనూహ్య స్పందన వచ్చింది. కానీ విడుదల తేదీపై కాస్త గందరగోళం నెలకొంది. దీనిపై స్పష్టతనిచ్చింది చిత్రబృందం.

ఈ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ.. "90ml ని మొదట ఈ నెల 5న (గురువారం) విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6కి మార్చుకున్నాం. మా బ్యానర్​కు పేరు తెచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ఆర్​ఎక్స్​ 100'ని మించిన హిట్ అవుతుందని మా ప్రగాఢ నమ్మకం" అని అన్నారు.

ఇక కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు 'దేవ‌దాస్‌, ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌టి విద్యావంతుడు 'ఆథ‌రైజ్​డ్ డ్రింక‌ర్‌'గా ఎందుకు మారాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 'A' సర్టిఫికెట్ లభించింది.

ఇవీ చూడండి.. కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన హీరో సందీప్ కిషన్

ABOUT THE AUTHOR

...view details