తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Love Story Movie: ''లవ్​స్టోరి' లాంటి సినిమాలు థియేటర్లలోనే చూడాలి' - లవ్​స్టోరి మూవీ న్యూస్

ఈ తరహా సినిమాలు థియేటర్లలో చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుందని 'లవ్​స్టోరి' నిర్మాతలు ఉన్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ 24వ తేదీని విడుదల చేస్తామని అన్నారు.

'Love story' movie
లవ్​స్టోరి

By

Published : Sep 18, 2021, 6:39 AM IST

Updated : Sep 18, 2021, 11:02 AM IST

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. నారాయణదాస్‌ కె నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్‌ సి.హెచ్‌ స్వరాలందించారు. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

.

*శేఖర్‌ కమ్ముల శైలిలో సాగే ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందించాం. ఇందులో ప్రేమకథతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటన్నది తెరపైనే చూడాలి. ఇలాంటి సినిమాలు థియేటర్లలో చూస్తేనే ఆ అనుభూతి తెలుస్తుంది. ఆంధ్రాలోని సమస్యలు ఈనెల 20కల్లా ఓ కొలిక్కి వచ్చినా రాకున్నా.. 24వ తేదీకి పక్కాగా విడుదల చేయాలని ముందే ఫిక్సయ్యాం. ప్రస్తుతం ఆంధ్రాలో నైట్‌ కర్ఫ్యూ దృష్టిలో పెట్టుకుని.. ఆటల టైమింగ్స్‌ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అక్కడా నాలుగు షోలు పడేలా ప్లాన్‌ చేసుకుంటున్నాం.

* శేఖర్‌ కమ్ములతో ధనుష్‌ హీరోగా ఓ పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాం. ఇందులో ఓ ప్రధాన పాత్ర కోసం మోహన్‌లాల్‌తో పాటు తెలుగు, హిందీ చిత్రసీమల నుంచి కొందరి పేర్లును పరిశీలిస్తున్నాం.

* నాగార్జునతో చేస్తున్న 'ది గోస్ట్‌' సినిమా చిత్రీకరణ దశలో ఉంది. నాగశౌర్యతో చేస్తున్న 'లక్ష్య' చిత్రాన్ని నవంబరులో విడుదల చేస్తాం. తర్వాత శివ కార్తికేయ, సుధీర్‌బాబులతో సినిమాలు చేస్తాం.

లవ్​స్టోరి మూవీ స్టిల్

ఆన్‌లైన్‌ టికెటింగ్‌తో నిర్మాతలకు మేలే

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని మేము స్వాగతిస్తున్నామన్నారు నిర్మాతలు నారాయణ దాస్‌ కె నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు. దీనిపై వాళ్లు మాట్లాడుతూ "మంచి ఆలోచనే అది. దీనిపై 2018లోనే తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ తరఫున ప్రభుత్వానికి ఓ లేఖ రాశాం. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం నిర్మాతలకు మేలు చేస్తుందని చెప్పాం. తెలంగాణలో నాలుగేళ్ల క్రితమే ఈ ఆన్‌లైన్‌ విధానం తీసుకురావాలని ప్రయత్నించారు. కొన్ని సమస్యల వల్ల అది కుదర్లేదు. అయినా ఇప్పటికే దేశవ్యాప్తంగా 80శాతం వరకు థియేటర్లలో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ ఉంది. ఏపీలో థియేటర్‌ల టికెట్‌ ధరలు, బుకింగ్‌ విధానం, ఇతర విషయాలపై ప్రభుత్వంతో సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలవనున్నాం.

Last Updated : Sep 18, 2021, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details