Nani ShyamSingha Roy movie: "విశ్వజనీనమైన కథతో తెరకెక్కిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంద"న్నారు నిర్మాత వెంకట్ బోయనపల్లి. ఆయన నిర్మించిన ఈ సినిమాలో నాని కథానాయకుడిగా నటించారు. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించారు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో చిత్ర విశేషాలను తెలిపారు నిర్మాత వెంకట్.
"ఈ చిత్రంలో ఓ అద్భుతమైన ప్రేమకథ ఉంది. సినిమా చూస్తే కచ్చితంగా 1970ల కాలం నాటి కోల్‌కతాలోకి వెళ్లినట్లే అనుభూతి చెందుతారు. ఆరోజుల్లో అక్కడి కల్చర్ ఎలా ఉండేదో తెలుస్తుంది. అప్పటి పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపిస్తాం. ఇదొక విశ్వజనీనమైన సినిమా. ఈ కథకు అందరూ కనెక్ట్ అవుతారు. అందుకే దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నాం. బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు హిందీలో విడుదల చేయడం లేదు".