తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అసురన్‌' తనయుడిగా అభిరామ్‌..! - producer suresh babu son abhiram debut with asuran remake

తమిళంలో ఘనవిజయం సాధించిన 'అసురన్' చిత్రం తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో వెంకీ సోదరుడు సురేశ్ బాబు కుమారుడు అభిరామ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం.

suresh babu
వెంకటేశ్

By

Published : Dec 6, 2019, 3:23 PM IST

ఓవైపు 'వెంకీమామ' చిత్ర ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తూనే తన తదుపరి చిత్రం 'అసురన్‌' రీమేక్‌పైనా దృష్టి సారిస్తున్నాడు విక్టరీ వెంకటేశ్. ఈ హీరో ప్రధాన పాత్రలో నటించబోయే ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోతున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్​చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో వెంకటేశ్ ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఒక కొడుకుగా సురేశ్ బాబు తనయుడు అభిరామ్‌ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

'అసురన్‌' మాతృకలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేసినప్పటికీ తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ వయసు పైబడిన పాత్రను మాత్రమే చేస్తున్నాడని, యువకుడి పాత్రను మరో యువ హీరోతో చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలొస్తున్నాయి.

ఇవీ చూడండి.. కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన బాలయ్య

ABOUT THE AUTHOR

...view details