కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలు, మంత్రులు అందరూ దీని బారిన పడుతున్నారు. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎవరో ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నారు. తాజాగా తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనా సోకి మృత్యువాతపడ్డారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
కరోనాతో ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు కన్నుమూత - పోకూరి రామారావు కన్నుమూత
నిర్మాత పోకూరి రామారావు కరోనా కారణంగా మృతి చెందారు. ఈతరం ఫిలిమ్స్ బ్యానర్లో ఎన్నో చిత్రాలను నిర్మించారు.
పోకూరి రామారావు
ఈతరం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోదరుడు పోకూరి రామారావు. ఇటీవలే రామారావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడం వల్ల రామారావు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఈతరం ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రాలకు రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు.
Last Updated : Jul 4, 2020, 12:48 PM IST