తన తండ్రి తీస్తున్న 'శాకుంతలం' సినిమాలో దుష్యంతుడి పాత్రకు దేవ్ మోహన్ ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నామని నిర్మాత, గుణశేఖర్ పెద్ద కుమార్తె నీలిమ గుణ ఆనందం వ్యక్తం చేశారు. సమంతకు సరిపోయే సరైన కథానాయకుడ్ని అన్వేషిస్తున్న క్రమంలో లాక్డౌన్లో అనుకోకుండా దేవ్ నటించిన 'సూఫియం సుజాతీయం' సినిమా చూశానని, దేవ్ దుష్యంతుడి పాత్రకు సరిగ్గా సరిపోతాడని అప్పుడే అనిపించిదని ఆమె అన్నారు. వెంటనే ఇన్‌స్టాలో మెసేజ్ పెడితే, రిప్లై ఇవ్వడాన్ని నమ్మలేకపోయామని నీలిమ తెలిపారు.
లాక్డౌన్ వల్ల దొరికిన 'శాకుంతలం' దుష్యంతుడు - టాలీవుడ్ న్యూస్
'శాకుంతలం'లో దుష్యంతుడు పాత్ర కోసం దేవ్ మోహన్ ఒప్పుకోవడం గురించి నిర్మాత నీలిమ గుణ చెప్పారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సోమవారం లాంఛనంగా మొదలైంది. షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు.
లాక్డౌన్ వల్ల దొరికిన 'శాకుంతలం' దుష్యంతుడు
ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన దేవ్‌కు కథ చెప్పి మూడు నెలలపాటు గుర్రపు స్వారీ, పోరాటాలు నేర్పించినట్లు నీలిమ ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు. మరో వారంలో 'శాకుంతలం' షూటింగ్ మొదలుపెడుతున్నట్లు తెలిపారు.
ఇది చదవండి:చిరకాల మిత్రుడితో చిరంజీవి సిక్కిం టూర్