సినీ పరిశ్రమపై పవన్ కల్యాణ్(Pawan Kalyan News) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన ప్రకటన అవాస్తమని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ స్పష్టం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ పేరుతో అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ వ్యక్తిగతంగా ప్రకటన చేయరని ఆయన వెల్లడించారు. అగ్ర నిర్మాతలంతా కలిసి పవన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని నట్టి కుమార్ ఆరోపించారు.
'పవన్ కల్యాణ్‌ను నిర్మాతలు తప్పుదోవ పట్టిస్తున్నారు!' - పవన్ కళ్యాణ్ ఆన్లైన్ టికెటింగ్
ఆన్లైన్ టికెట్స్ విధానంపై ఇటీవలే పవన్ కల్యాణ్(Pawan Kalyan News) వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన ప్రకటన అవాస్తవమని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ స్పష్టం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ దాస్ నారంగ్.. వ్యక్తిగతంగా ప్రకటన చేయరని వెల్లడించారు. ఈ విషయంలో అగ్ర నిర్మాతలంతా పవన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని నట్టి కుమార్ ఆరోపించారు.
పవన్ కల్యాణ్‌తో సినిమాలు తీసే నలుగురు నిర్మాతలు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి క్షమాపణలు కోరడం సమంజసంగా లేదని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్‌ను తప్పుదోవ పట్టిస్తున్న నిర్మాతలను అభిమానులు నిలదీయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ పోర్టల్స్ సినిమా టికెట్(Online Ticket Issue) ధరలను ప్రేక్షకుల నుంచి అధికంగా వసూలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అడ్డుకోవడం లేదని నట్టికుమార్ ప్రశ్నించారు.
ఇదీ చూడండి..పవన్‌తో సినీ నిర్మాతల భేటీ.. ఎవరెవరు కలిశారు? ఏం మాట్లాడారు?