Bheemla nayak release date: పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా.. ఈ సంక్రాంతికే రావాల్సింది. కానీ పలు అనివార్య పరిస్థితుల వల్ల వాయిదా పడింది. అయితే ఫిబ్రవరి 25 కొత్త రిలీజ్ డేట్ అని కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. కరోనా పరిస్థితులు ఇంకా కుదుటపడని నేపథ్యంలో మరోసారి రిలీజ్‌పై ఇటీవల స్పష్టతనిచ్చారు.
ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న థియేటర్లలోకి సినిమాను తీసుకొస్తామని పోస్టర్ విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి రిలీజ్‌పై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
'డీజే టిల్లు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో బుధవారం జరిగింది. ఇందులో ఓ రిపోర్టర్ 'భీమ్లా నాయక్' రిలీజ్ గురించి నాగవంశీని అడగ్గా.. 'ఏపీలో నైట్‌కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే సినిమా రిలీజ్ చేస్తాం' అని స్పష్టం చేశారు.