తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఖిలాడి' డైరెక్టర్​కు గిఫ్ట్​గా కోటి రూపాయల కారు - ఖిలాడి డైరెక్టర్ రమేశ్ వర్మ

Khiladi movie: 'ఖిలాడి' విడుదలకు ముందే డైరెక్టర్​కు అదిరిపోయే కారును గిఫ్ట్​గా ఇచ్చారు సినిమా నిర్మాత. ఇంతకీ దాని విలువ ఎంతంటే?

ravi teja khiladi movie
రవితేజ ఖిలాడి మూవీ

By

Published : Jan 30, 2022, 11:32 AM IST

Director Ramesh varma: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా 'ఖిలాడి'. ఫిబ్రవరి 11న థియేటర్లలోకి రానుంది. ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ మూవీపై​ చిత్రబృందం పూర్తి ధీమాతో ఉంది. పక్కాగా హిట్​ కొడతామని చెబుతోంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్​కు ముందే డైరెక్టర్​ రమేశ్​వర్మకు ఖరీదైన గిఫ్ట్​ ఇచ్చారు నిర్మాత కోనేరు సత్యనారాయణ.

కారుతో డైరెక్టర్ రమేశ్ వర్మ

'ఒక ఊరిలో', 'రైడ్', 'వీర' లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రమేశ్ వర్మ.. 2019లో 'రాక్షసుడు' చిత్రంతో థ్రిల్లింగ్ హిట్​ సొంతం చేసుకున్నారు. దీని తర్వాత చేస్తున్న సినిమానే 'ఖిలాడి'. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ.. దాదాపు రూ.1.15 కోట్ల విలువైన రేంజ్​ రోవర్​ కారును సదరు దర్శకుడికి బహుమతిగా ఇచ్చారు.

ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

రవితేజ ఖిలాడి మూవీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details