ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మంచి మనసు చాటుకున్నారు. కరోనా వల్ల పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకున్నారు. మరో ఇద్దరు నిర్మాతలు చదవాలవాడ శ్రీనివాస్ రావు, యలమంచిలి రవిచంద్తో కలిసి 600మంది సినీ కార్మికులకు నెలరోజులు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. 'కళామ్మతల్లి చేదోడు' అనే పేరుతో ఈ పంపిణీ కార్యక్రమం చేశారు.
దిల్‌రాజు దాతృత్వం.. నిత్యావసరాల పంపిణీ - dilraju kalamma talli chedodu
కరోనా వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీకార్మికులకు తన వంతుగా సాయం చేశారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. 'కళామ్మతల్లి చేదోడు' కార్యక్రమం ద్వారా 600 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
![దిల్‌రాజు దాతృత్వం.. నిత్యావసరాల పంపిణీ Producer Dilraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12073237-54-12073237-1623239357947.jpg)
దిల్‌రాజు
ఇటీవలే దిల్‌రాజు పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్' చిత్రాన్ని నిర్మించి బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు. పవన్‌తో మరో చిత్రాన్ని చేసే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. త్వరలోనే రామ్‌చరణ్-శంకర్ కాంబోలో రానున్న చిత్రం సహా పలు చిత్రాలను నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు రాజు.