RRR Release Date: ఫిబ్రవరి చివరి వారం నుంచి వారానికో పెద్ద సినిమా విడుదలవుతుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. అయితే విడుదల తేదీల విషయంలో నిర్మాతల మధ్య సమన్వయం ఉంటేనే అనుకున్న తేదీకి సినిమాలు విడుదలవుతాయని పేర్కొన్నారు. అందుకే 'ఆర్ఆర్ఆర్' లాంటి చిత్రాలు రెండు విడుదల తేదీలను ప్రకటించాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అందులో ఏదో ఒక తేదీ అనుకూలంగా ఉంటే విడుదలవడం తథ్యమన్నారు.
'ఆర్ఆర్ఆర్'ను మార్చి 18 లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించింది చిత్రబృందం. మరో పాన్ఇండియా మూవీ 'రాధేశ్యామ్'ను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, త్వరలో రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తామని ఇటీవల ఆ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ స్పష్టం చేశారు. మార్చి 4న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుందని సమాచారం.