ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ రెండో వివాహం చేసుకున్నారు. నిన్న రాత్రి నిజామాబాద్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ పెళ్లి జరిగింది. లాక్‌డౌన్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయం ఉన్న తేజస్విని అనే మహిళనే దిల్‌రాజు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె గతంలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసినట్లు సమాచారం. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మృతి చెందారు..
లాక్డౌన్లో దిల్‌రాజు రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్ - దిల్‌రాజు రెెండో పెళ్లి
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
ఎన్నాళ్ల నుంచో వస్తున్న తన రెండో పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో ఇప్పటికే స్పందించారు దిల్‌రాజు. ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేశారు.
"ప్రస్తుత పరిస్థితులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో వృత్తిపరంగా అంత త్వరగా కోలుకోలేం. వ్యక్తిగతంగానూ నాకు కొన్ని రోజుల నుంచి టైమ్ బాగోలేదు. అంతా త్వరలో సర్దుకుంటుందని భావిస్తున్నా. అదే ఆశతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా. దానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నా" అని దిల్‌రాజు తెలిపారు.