ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత - బీఏ రాజు మరణ వార్త
00:30 May 22
నిర్మాత బీఏ రాజు కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. గుండెపోటుతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సినిమా జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన ఆయన.. 'లవ్లీ', 'వైశాఖం' వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. సూపర్ హిట్ అనే మ్యాగజైన్‌ను నిర్వహిస్తున్నారు. పలువురు అగ్ర కథానాయకులకు వ్యక్తిగత పీఆర్వోగా వ్యవహరించారు.
ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితమే ఆయన భార్య, దర్శకురాలు బీఏ జయ కన్నుమూశారు.