కొవిడ్ ప్రభావంతో స్తంభించిన చిత్ర పరిశ్రమ.. వచ్చే రెండు మూడు నెలల్లో తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఈ ఏడాది మాత్రం టాప్ హీరోల సినిమాలు విడుదల కావని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఓటీటీల్లో నటించేందుకు చిరంజీవి సిద్ధం - CHIRANJEEVI OTT
అగ్రహీరోల సినిమాలు.. ఈ ఏడాది థియేటర్లలో విడుదల కావడం కష్టమేనని చెప్పారు నిర్మాత అల్లు అరవింద్. మెగాస్టార్ చిరంజీవి.. ఓటీటీల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
![ఓటీటీల్లో నటించేందుకు చిరంజీవి సిద్ధం ఓటీటీల్లో నటించేందుకు చిరంజీవి సిద్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8416239-1071-8416239-1597394550198.jpg)
మెగాస్టార్ చిరంజీవి
ఓటీటీ ఆహా యాప్ లో ఆగస్టులో విడుదలవుతున్న సినిమాల వివరాలను వెల్లడించారు అల్లు అరవింద్. దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ పెరుగుతుందని, అగ్ర కథానాయకులు కూడా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. చిరంజీవితో ఆహా కోసం సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. కథ నచ్చితే ఓటీటీలోనూ ఆయన నటించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.