లాక్డౌన్ తర్వాత తమ ఇంటి కరెంట్ బిల్లులపై ఫిర్యాదు చేసిన బాలీవుడ్ నటీనటులు ఒక్కొక్కరు ఆ లెక్కలు సరిపోయాయని చెబుతున్నారు. ఇటీవలే తాప్సీ ఇదే విషయమై ట్వీట్ చేయగా, ఇప్పుడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ.. తన సమస్య కూడా తీరిపోయిందని పేర్కొన్నాడు. ముంబయిలో మరెవరికైనా ఇలాంటి సమస్య ఉంటే అదానీ ఎలక్ట్రికల్ బోర్డును సంప్రతించాలని ట్వీట్ చేశాడు.
అంతకుముందు ఇదే విషయమై ట్వీట్ చేసిన అర్షద్.. తనకు రూ.1,03, 564 కరెంట్ బిల్ వచ్చిందని రాసుకొచ్చాడు. దీనిని కట్టేందుకు తన పెయింటింగ్స్ కొనాలని నెటిజన్లను కోరారు. తర్వాతి బిల్ కట్టేందుకు తన కిడ్నీలు అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాడు.