బాలీవుడ్ హీరోయిన్లు, నిజజీవితంలో అక్కాచెల్లెళ్లు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా.. ఓ హాలీవుడ్ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. కాకపోతే గాత్రం మాత్రమే అందించనున్నారు. 'ఫ్రోజెన్ 2' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ఎల్సా, అన్నాలకు బాలీవుడ్ వెర్షన్లో డబ్బింగ్ చెప్పనున్నారు.
ఎల్సా పాత్రకు గాత్రమందించడం తనకు వచ్చిన అద్భుత అవకాశమని సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక. 'ఫ్రోజెన్'.. తనకిష్టమైన హాలీవుడ్ సిరీస్ అని చెప్పింది పరిణీతి. అక్కతో కలిసి డబ్బింగ్ చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపిందీ భామ.