తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నిక్‌' పేరును అందుకే తొలగించా: ప్రియాంక చోప్రా - ప్రియాంక చోప్రా నిక్

Priyanka Nick Jonas: స్టార్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ విడాకులు తీసుకుంటున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఈ రూమర్స్​పై మరోసారి స్పందించారు నటి ప్రియాంక.

priyanka
ప్రియాంక

By

Published : Jan 15, 2022, 5:31 AM IST

Priyanka Nick Jonas: సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తన భర్త నిక్‌జొనాస్‌ పేరు తొలగించటంతో ప్రియాంక చోప్రా విడాకులు తీసుకుంటుందంటూ వార్తలొచ్చాయి. ఆ రూమర్స్‌కు గతంలోనే చెక్‌ పెట్టిన ఆమె మరోసారి స్పందించారు. ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలా ఎందుకు జరిగిందో వివరించారు. వృత్తిపరమైన కారణాల వల్ల తన భర్త పేరును తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. జరిగింది ఒకటైతే కొందరు సోషల్‌ మీడియా వేదికగా మరో రకంగా చిత్రీకరిస్తారని చెప్పుకొచ్చారు. చాలామంది తమ జీవితంలో సోషల్‌ మీడియాకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, అది అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఏదైనా ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటే ఏవేవో ఊహించుకుంటుంటారని అన్నారు.

ప్రియాంక చోప్రా తన భర్త పేరును తీసేయటం గతేడాది నవంబరులో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ తర్వాత, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిక్‌ జొనాస్‌ పెట్టిన పోస్ట్‌కు ప్రియాంక రొమాంటిక్‌ కామెంట్‌ పెట్టి, ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల.. 'ది మ్యాట్రిక్స్‌' అనే హాలీవుడ్‌ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన ప్రియాంక పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 'జీ లే జరా' చిత్రంతో మళ్లీ బాలీవుడ్‌లో సందడి చేయబోతుంది. ఆలియాభట్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో ఫర్హాన్‌ అక్తర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details