తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ద స్కై ఈజ్​ పింక్​' ఓ మధుర జ్ఞాపకం: పీసీ - the sky is pink

బాలీవుడ్​ స్టార్ కథానాయిక​ ప్రియాంక చోప్రా తాజాగా హిందీలో నటిస్తున్న చిత్రం 'ద స్కై ఈజ్​ పింక్​'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా భావోద్వేగంతో ఓ ట్వీట్​ చేసింది.

ప్రియాంక

By

Published : Jun 12, 2019, 10:42 PM IST

బాలీవుడ్ నుంచి హాలీవుడ్​కు రూట్​ మార్చిన ప్రియాంక చోప్రా రెండేళ్ల త‌ర్వాత హిందీలో నటిస్తోంది. 'ద స్కై ఈజ్‌ పింక్‌' అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడు. జైరా వ‌సీమ్ ప్ర‌ధాన పాత్ర‌ పోషిస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక 21ఏళ్ల కూతురికి అమ్మగా కనిపించనుంది. మొత్తం నాలుగు విభిన్న క్యారెక్టర్లలో కనువిందు చేయనుందని సమాచారం. సోనాలి బోస్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. చిత్రబృందంతో దిగిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసింది ప్రియాంక. ఈ చిత్రం త‌న‌కు చాలా ప్రత్యేకమని, ఈ షూటింగ్​ సమయం త‌న‌కు ఎంతో నేర్పిందని చెప్పుకొచ్చింది.

"రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న అమ్మాయి బతకదని వైద్యులు చెబుతారు. పెద్దయ్యాక ఓ సందేశాత్మక వ్యాఖ్యాతగా, పుస్తక రచయితగా ఆ అమ్మాయి ఎలా ఎదిగిందనేదే కథాంశం" అని సినీ వర్గాలు తెలిపాయి. ఇది అయేషా చౌదరి అనే రచయిత నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అయేషా పాత్ర‌లో జైరా క‌నిపించ‌నుండ‌గా, వయ‌సులోని వివిధ ద‌శ‌ల‌లో ప్రియాంక లుక్స్ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. రియల్​ లైఫ్​ స్టోరీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్రియాంక... సిద్ధార్ద్ రాయ్ క‌పూర్‌, ఆర్ఎస్‌వీపీతో క‌లిసి నిర్మించింది.

ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ప్రియాంక చోప్రా 2015లో 'దిల్ ద‌ఢ్‌ఖ‌నే దో' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చారు. 'ద స్కైజ్ ఈజ్‌ పింక్' వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న‌ రెండో చిత్రం. 2019 అక్టోబ‌ర్ 11న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

ఇది చదవండి: 2వేల మంది రైతుల రుణాలు చెల్లించిన బిగ్​బీ

ABOUT THE AUTHOR

...view details