తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూర్యకు జోడీగా 'గ్యాంగ్​లీడర్'​ భామ - Surya 40th movie heroine

పాండిరాజ్‌ దర్శకత్వంలో తమిళ స్టార్​ హీరో సూర్య నటిస్తోన్న సినిమాలో హీరోయిన్​గా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.

priyan
అరుళ్‌ మోహన్‌

By

Published : Jan 31, 2021, 7:30 AM IST

'గ్యాంగ్‌లీడర్‌' చిత్రంతో తెలుగు తెరపై అడుగు పెట్టి.. తొలి ప్రయత్నంలోనే అందరి హృదయాలను కొల్లగొట్టింది నటి ప్రియాంక అరుళ్‌ మోహన్‌. అందుకే ఇప్పుడు ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ వరుస ఆఫర్లతో జోరు చూపిస్తోంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తమిళంలో అగ్ర కథానాయకుడు సూర్య సరసన ఆడిపాడే అవకాశాన్ని దక్కించుకుంది. సూర్య ప్రస్తుతం పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇది ఆయనకు 40వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో సూర్యకు జోడీగా ప్రియాంకను ఖరారు చేసినట్లు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది.

'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో విజయం అందుకున్నారు సూర్య. ఆయన శైలికి సరిపడే ఓ విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇదీ చూడండి : హాలీవుడ్​ స్థాయిలో షారుక్​ 'పఠాన్​'

ABOUT THE AUTHOR

...view details