priyanka mohan Suriya Et movie: మహిళల్లో చైతన్యం నింపే బాధ్యత కలిగిన పాత్రని పోషించడం ఎంతో తృప్తినిచ్చిందని చెబుతోంది ప్రియాంక మోహన్. న్యాయంగా ఉంటే ఎవ్వరికీ తలవంచాల్సిన పని లేదని చెప్పే అర్థవంతమైన నా పాత్ర సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. నానితో కలిసి 'గ్యాంగ్‌లీడర్', శర్వానంద్‌తో కలిసి 'శ్రీకారం' సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి ప్రియాంక. ఇప్పుడు తమిళంలో వరుసగా అవకాశాల్ని అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇటీవల సూర్యతో కలిసి 'ఈటి'లో నటించింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రియాంక మోహన్ చిత్రానికి సంబంధించిన విశేషాలను ముచ్చటించింది. ఆ విషయాలివే..
"స్ఫూర్తిదాయకమైన పాత్రలు ఎప్పుడో కానీ రావు. నాకు ఈ సినిమాతో అలాంటి అవకాశం దొరికింది. రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తా. ప్రథమార్థం వరకు సరదాగా గడిపే ఓ సగటు అమ్మాయిగా కనిపిస్తా. ద్వితీయార్థంలో ఓ లక్ష్యం కోసం పాటుపడుతుంటా. సూర్యకి సమాన స్థాయి పాత్ర నాది. తమిళంలో ‘డాక్టర్’ తర్వాత శివకార్తికేయన్‌తోనే ‘డాన్’ చిత్రం చేశా. ఆ సమయంలోనే నాకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది".
"సమాజంలో మహిళలు చాలా మంది ఎదుర్కొనే అంశాలు నా పాత్రలో ప్రతిబింబిస్తాయి. దర్శకుడు పాండిరాజ్ ఆయన శైలి నుంచి బయటికొచ్చి చేసిన చిత్రమిది. మహిళలు ఏ రంగంలోనైనా సౌకర్యంగా సంతోషంగా ఉండాలి. పనిలో ప్రతిభ చూపించడమే కాదు, సమస్య వస్తే ఎదుర్కోవడానికీ సిద్ధంగా ఉండాలి. మహిళా దినోత్సవం వారంలోనే మా ‘ఈటి’ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుండడం చాలా ఆనందంగా ఉంది".
- ప్రియాంక మోహన్, హీరోయిన్
మనసుకు నచ్చిన పాత్రలతోనే..
varsha bollamma Rajtarun movie: కొవిడ్ తర్వాత థియేటర్‌కి నేనైతే నవ్వుకోవడానికే వెళ్లాలనుకుంటా. మా సినిమా అచ్చం అలాంటి అనుభూతినే పంచుతుందని చెప్పుకొచ్చింది వర్ష బొల్లమ్మ. 'విజిల్', 'జాను', 'చూసీ చూడంగానే', 'మిడిల్‌క్లాస్ మెలోడీస్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక ఈమె. ఇటీవల రాజ్‌తరుణ్‌తో కలిసి 'స్టాండప్ రాహుల్'లో నటించింది. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ చిత్ర విశేషాలు ఇలా చెప్పుకొచ్చింది.
ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?