తన సినీ కెరీర్ గురించి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ భారీ ప్రాజెక్ట్‌లో పాట కోసం దర్శకుడు తనను దుస్తులు తొలగించమన్నారని తెలిపింది.
పాట కోసం దుస్తులు తీసేయమన్నారు: ప్రియాంక చోప్రా - ప్రియాంక చోప్రా బుక్
గతంలో ఓ సినిమాలో పాట షూటింగ్లో ఎదురైన చేదు అనుభవాల్ని వెల్లడించింది ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్రా. ఆ సంఘటన తర్వాత సల్మాన్ ఖాన్ అండగా నిలిచారని పేర్కొంది.
కోలీవుడ్ చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన ప్రియాంక.. తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవల 'అన్‌ఫినిష్డ్'’ పేరుతో తన బయోగ్రఫిని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులో తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే దర్శకుడు ఇబ్బంది పెడితే సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడని ఆమె బయోగ్రఫిలో పేర్కొంది. 'కెరీర్ ఆరంభంలోనే భారీ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఎంతో ఆనందించాను. అయితే, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణలో భాగంగా దర్శకుడు నన్ను దుస్తులు తొలగించమని చెప్పాడు. అంతేకాకుండా ప్రేక్షకులు సినిమాలు చూడాలంటే ఈ సన్నివేశాలు ఉండాలన్నాడు. దానికి నేను అంగీకారం తెలపలేదు. సినిమా వదిలేయాలని నిశ్చయించుకున్నా. ఈ విషయం తెలుసుకున్న నా కో-స్టార్ సల్మాన్ వెంటనే నిర్మాతతో మాట్లాడి.. నాకెలాంటి సమస్య లేకుండా చూశారు. నిర్మాతతో సల్మాన్ ఏం చెప్పారో తెలీదు కానీ.. నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షూట్ పూర్తి చేశారు' అంటూ ప్రియాంక చెప్పారు.