గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా భర్త, సింగర్ నిక్ జోనస్ శనివారం రాత్రి ఓ షో షూటింగ్లో పాల్గొనగా ప్రమాదవశాత్తు గాయపడినట్లు వార్తలొచ్చాయి. దీంతో అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారని ప్రచారం సాగింది. తాజాగా ఈ విషయంపై స్పందించాడు నిక్.
ప్రియాంక భర్త నిక్ జోనస్‌కు యాక్సిడెంట్ - ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్
తాను గాయపడినట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన నటి ప్రియాంకా చోప్రా భర్త, సింగర్ నిక్ జోనస్.. బైక్‌రైడ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేశాడు. ఓ పక్కటెముక విరిగినట్లు చెప్పిన అతడు.. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వెల్లడించాడు.
చోప్రా
బైక్ రైడ్ చేస్తుండగా గాయపడినట్లు తెలిపాడు జోనస్. ఈ ప్రమాదంలో ఓ పక్కటెముక విరిగి, స్వల్ప గాయాలు అయినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: బాఫ్టా వేడుకలో ప్రియాంక సోయగాలు